దోశలో బొద్దింక.. టిఫిన్ తినాలని వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం

by Aamani |
దోశలో బొద్దింక.. టిఫిన్ తినాలని వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం
X

దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో దారుణం చోటుచేసుకుంది. పీర్జాదిగూడ వరంగల్ హైవే లో ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్ లో టిఫిన్ చేయాలనీ వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. హోటల్ లో దోశ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక దర్శనం ఇచ్చింది. కంగు తిన్న కస్టమర్స్ సిబ్బంది ని నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తినే దోశలో పడిన బొద్దింక కనిపించిందని, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇన్ని తనిఖీలు నిర్వహించిన నిర్వాహకుల్లో మార్పు రావడం లేదని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడం వల్లనే హోటల్ లలో ఈ తరహా జరుగుతున్నాయని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story