కిశోర బాలికలు పోషకాహార పదార్థాలు తీసుకోవాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్

by Aamani |
కిశోర బాలికలు పోషకాహార పదార్థాలు తీసుకోవాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి : సరైన పోషకాహార విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని కిశోర బాలికలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవారం జిల్లా శిశు సంక్షేమ శాఖ,మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో, భేటీ బచావో - భేటీ పడావో లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా గర్ల్ చైల్డ్ న్యూట్రీషన్ కిట్లను కిషోర బాలికలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల మనుగడ, రక్షణ, సాధికారత సాధించాలంటే చదువే ముఖ్యమన్నారు.

సరైన పోషకాహార విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని కిశోర బాలికలకు సూచించారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని, కిశోర బాలికల పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది కనుక పోషక పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. జిల్లాలో కిశోర బాలికలకు 360 కిట్లను అందించడం జరిగిందని తెలిపారు. 16 వస్తువులతో కూడిన ఈ కిట్ లోని ప్రతి వస్తువును ఉపయోగించుకోవాలని సూచించారు. బాలికలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కె.లలిత కుమారి, డీసీపీ ఓ రత్నం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed