ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ ముందు కార్మికుల ధర్నా

by Sridhar Babu |
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ ముందు కార్మికుల ధర్నా
X

దిశ ,హత్నూర : హత్నూర మండల పరిధిలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని శుక్రవారం పరిశ్రమ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్స్ ఉద్యోగులకు పరిశ్రమ యజమాన్యం మూడు

నెలల తర్వాత పర్మినెంట్ కల్పిస్తామని మాట తప్పిందన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు అన్ని విధాలా సహాయ సహకారాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

డిమాండ్లను పరిష్కరిస్తామన్న యాజమాన్యం

కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమింప చేశారు.

Advertisement

Next Story

Most Viewed