రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అండగా ఉంటాం

by Sridhar Babu |
రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అండగా ఉంటాం
X

దిశ,అక్కన్నపేట : సిద్దిపేట జిల్లాలోని ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేషన్ లను బలోపేతం చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కన్నపేట మండలంలో గల ప్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేషన్లను ఎన్నుకున్నారు. వాటికి సంబంధించిన చైర్మన్, సీఈఓ, బోర్డు డైరక్టర్స్, ఇతర రైతులతో మండల రైతు వేదికలో ఇంట్రాక్షన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధ్యక్షతన నిర్వహించారు. రైతులకు మార్కెట్ పెసిలిటీలు ,సలహాలు ఇచ్చేందుకు కృషికల్ప ఫౌండేషన్ సీఈఓ పాటిల్ బృందం రైతులతో కలిసి పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ముందుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక , ఉద్యాన వన శాఖ అధికారి సువర్ణ రైతులకు ఎఫ్​ఓ లు డెవలప్ కావడానికి సూచనలు చేశారు.

మండలాల్లో ఫర్టిలైజర్ ద్వారా అందిస్తున్న ఆక్టివిటిస్, విజయవంతం కావడానికి చేసిన చర్యలపై నాబార్డు డీడీఎం నిఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభసాటిగా మారడంలో ఈఎఫ్​ పీఓ ల పాత్ర కీలకం అన్నారు. మార్కెట్ కి అవసరమైన పంట వెయ్యడానికి రెడీగా ఉండాలని సూచించారు. కృషి కల్ప ఫౌండేషన్ సీఈఓ మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ తమ ఫౌండేషన్ ద్వారా డెవలప్ చేశాం అన్నారు. అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు, ఎంపీడీవో జయరాం, గ్రామ రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed