- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నిర్లక్ష్యంగా నిలిపి.. నిండు ప్రాణాలు బలి..
దిశ, పాపన్నపేట : ప్రధాన రహదారుల పక్కనే భారీ వాహనాలను నిలపడంతో ఆ మార్గాన వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. అయినా కొంతమంది వాహనదారులకు అవేం పట్టడం లేదు. పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో ఉన్న ధాన్యం మిల్లు వద్ద ట్రాక్టర్లు, లారీలను రోడ్డుకిరువైపులా నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
రైస్ మిల్లు ముందు రెండు వైపులా వాహనాలు నిలిపి ఉంచడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెలలో ఈ ప్రాంతంలోనే కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఓ యువకుడు సైతం ఆటోతో వెనుక నుంచి ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అధికారులు స్పందించి రోడ్డు పక్కన వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.