దేవుణ్ణి కూడా వదలని దొంగలు.. పెద్దమ్మ దేవాలయంలో చోరీ...

by Sumithra |
దేవుణ్ణి కూడా వదలని దొంగలు.. పెద్దమ్మ దేవాలయంలో చోరీ...
X

దిశ, కోహెడ : కోహెడ మండల పరిధిలోని వరుకోలు గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయం తలుపులు పగలగొట్టి ఆలయం లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీ పగలగొట్టి నగదు, పుస్తె మట్టెలు అమ్మవారి ముక్కుపుడక, సుమారు లక్ష ఇరవై వేల రూపాయల ఆభరణాలను గుర్తుతెలియని దొంగలు అపహరించుకుని వెళ్లారు. అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. ఉదయం స్థానికుల సమాచారంతో ఆలయానికి చేరుకున్న ముదిరాజులు తీవ్ర ఆందోళనకు గురై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed