యూట్యూబర్లను చూస్తే సీఎం రేవంత్ కు వణుకెందుకు.. మాజీ మంత్రి హరీష్ రావు

by Sumithra |
యూట్యూబర్లను చూస్తే సీఎం రేవంత్ కు వణుకెందుకు.. మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, నర్సాపూర్ : రాష్ట్రంలో హైడ్రా పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా చేస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని అన్నారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రుణమాఫీ చేయలేని భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్ లో వేసి తాళం వేశారని అన్నారు.

ఎన్నికల సమయంలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నలకే బోనస్ అని చెప్పి రైతులను మోసం చేస్తున్నావని ఆరోపించారు. రాష్ట్రంలో కుక్కల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఏర్పడి డాక్టర్లు మందుల కోసం బయటకు చీటీలు రాస్తున్నారని తెలిపారు. రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వం పై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు 4000 పెన్షన్ ఇవ్వడం లేదని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని విమర్శించారు. సీఎం మాటలకు సొంత పార్టీ నాయకులే ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల రైతు మరణించాలని గుర్తు చేశారు.

యూట్యూబర్ లను చూస్తే సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పడుతుందని అందుకనే వారిపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నహీం, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చంద్ర గౌడ్, సత్యం గౌడ్, మన్సూర్, నరసింహులు బిక్షపతి శ్రీశైలం, హుస్సేన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story