బావను హతమార్చిన.. బావమరిది

by Shiva |
బావను హతమార్చిన.. బావమరిది
X

తండ్రి ఆస్తికి అడ్డుగా ఉన్నాడనే ఘాతుకం

దిశ, మెదక్ ప్రతినిధి: పట్టణంలోని పెద్ద బజార్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. తండ్రి ఆస్తికి బావ అడ్డొస్తున్నాడనే బావమరిది మద్యం తాగించి కొట్టి చంపినట్లు పట్టణ సీఐ సంజయ్ తెలిపారు. పట్టణంలోని పెద్ద బజార్ లో జరిగిన హత్య కు కారణమైన బావమరిదిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. సీఐ కథనం మేరకు.. గాంధీ నగర్ కు చెందిన దర్జీ శ్రీనివాస్ పెద్ద బజార్ లో దారుణ హత్యకు గురయ్యాడు.

గురువారం జరిగిన హత్య శనివారం వెలుగులోకి వచ్చింది. మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. శ్రీనివాస్ ను సొంత బావమరది సంతోష్ హత్య చేసినట్లు నిర్ధారించారు. శ్రీనివాస్ హత్యకు ప్రధాన కారణం తండ్రి నుంచి దక్కాల్సిన ఆస్తికి తన బావ అడ్డురావడమే కారణమని తెలిపారు. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్ తన బావను హతమార్చేందుకు పథకం రూపొందించాడు.

గురువారం రోజు మద్యం తాగేందుకు ఇద్దరు వారి షాప్ వద్దకు వెళ్లారు. శ్రీనివాస్ కు ఫుల్ గా మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తరవాత తలపై కొట్టి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. రెండు రోజుల తరవాత షాప్ వద్ద దుర్వాసన రావడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ ను హత్య చేసిన సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు.

Advertisement

Next Story