గుర్తింపు లేని పాఠశాలలో చేరి మోసపోయిన విద్యార్థులు

by Shiva |
గుర్తింపు లేని పాఠశాలలో చేరి మోసపోయిన విద్యార్థులు
X

దిశ‌, జహీరాబాద్: గుర్తింపు లేని పాఠశాల యాజమాన్యం నిర్వాకంతో ఎనమిది మంది పదో తరగతి విద్యార్థులు మోసపోయిన జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఆక్స్ ఫర్డ్ స్కూల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా పురాతనమైన పాఠశాల. కాలక్రమేణ యాజమాన్య వైఖరి వల్ల ఉన్న గుర్తింపును కోల్పోయింది. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు సంవత్సరం అంతా పాఠాలు చెప్పారు.

పరీక్షలు దగ్గర పడటంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసింది. పరీక్ష రేపు అనగా హాల్ టికెట్లు ఎక్కడా అని ప్రశ్నిస్తే.. వారి నుంచి సమాధానం రాకపోయే సరికి విద్యార్థులకు అసలు విషయం అర్థమైంది. పాఠశాలకు ప్రభుత్వం గుర్తింపు లేకుండా సదరు పాఠశాలలో చదివిన విద్యార్థులు పది పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అనర్హులు. అయినా, సదరు పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాయిస్తామంటూ ప్రిన్సిపాల్ వారికి మాయ మాటలు చెప్పడం కొస మెరుపు.

దీంతో మోసాన్ని గుర్తించిన విద్యార్థులు, వారి తల్లిద్రండ్రులు తమకు న్యాయం చేయాలంటూ జహీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో బసంత్‌పూర్ నుంచి ధనరాజ్, అహ్మద్ నగర్ నుంచి సమీర్ , దత్తగియోని కాలనీ నుంచి రాహుల్, పాస్తాపూర్ నుంచి ఇస్మాయిల్, రాంనగర్ నుంచి అక్బర్, సానియా, మన్నపూర్ నుంచి దీనా, మామ్‌నగర్ అర్షియా ఉన్నారు. ఫిర్యాదుపై స్పందించిన ఎస్సై శ్రీకాంత్, ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో పదో తరగతి చదివినట్లుగా ఆధారాలు ఉంటే వాటిని తీసుకురావాలని సూచించారు. ఇంతకు ముంతే ఆక్స్ ఫర్ట్ పాఠశాలకు గుర్తింపు లేదని, పలుమార్లు యాజమాన్యం, విద్యార్థులకు ఇదే విషయంలో హెచ్చరించామని మండల విద్యాధికారి బసవరాజ్ తెలిపారు.

మొదటి, రెండో టర్మ్ లో పరీక్షలు రాయించకపోవడంతో విద్యార్థులు ప్రిన్సిపాల్ ను పలుమార్లు నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ అలా ఏం లేదని, ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో నేరుగా ఫైనల్ పరీక్షలే రాయిస్తానని నమ్మబలుకుతూ చివరిగా విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాల నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్ ఆక్స్ ఫర్డ్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు శ్రీనివాస్, వాసు నాయక్, తదితరులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed