- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ఓటర్ల నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్..
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రోత్సహించేందుకు ఆదివారం ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఓటర్ల నమోదుకు రెండు రోజులు స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా శనివారం సంగారెడ్డి పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాల, సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పక తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు.
కొత్తగా నమోదు చేయబడిన ఓటర్ల పేర్లను నమోదు చేయడమే కాకుండా, మరణించిన వారి పేర్లను తొలగించాలని, అలాగే డబుల్ నమోదైన ఓటర్ల పేర్లను కూడా తొలగించాలని పోలింగ్ బూత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ కార్యక్రమం కోసం రెండు రోజుల ప్రత్యేక క్యాంపెయిన్ ప్రకటించినందుకు ఆదివారం కూడా బీఎల్ఓ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, బీఎల్ఓలు రజిత, నరసమ్మ, పార్వతమ్మ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.