- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ లో చేరిన 60 మంది కార్యకర్తలు
దిశ, గుమ్మడిదల: మండల పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కనుకుంట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 60 మంది కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల కన్నీరు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం యువతను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని అందుకే నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికలలో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ వారికి అభినందనలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, మాజీ మండల్ ప్రెసిడెంట్ వీరారెడ్డి, కానుకుంట గ్రామ సర్పంచ్ నీలమ్మ, ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, అంజాద్, రవీందర్ గౌడ్, వెంకటేష్, మహిపాల్ రెడ్డి, శంకర్, సుధాకర్, ప్రేమ్ కుమార్, రమేష్, నాగరాజు, ఆశీర్వాదం, రాజు, తదితరులు పాల్గొన్నారు.