- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబరి చేసింది..వాచ్ మెన్ తమ్ముడే
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైత్రివనం ప్రగతినగర్ అపార్ట్మెంట్ లో గన్ తో బెదిరించి బంగారం చోరి చేసిన కేసును పోలీసులు చేధించారు. అపార్ట్మెంట్ వాచ్ మెన్ తమ్ముడే చోరికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నింధితుడిని అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం..దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామానికి చెందిన చాకలి రవి బతుకు దెరువుకోసం 2009 లో సౌదీ అరేబియాకు వెళ్లి 2020 కరోనా సమయంలో తిరిగి వచ్చాడు. గ్రామంలో చెడు అలవాటులకు బానిస కావడంతో చేతిలో డబ్బులు ఖర్చు అయ్యాయి. డబ్బులు సులభంగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో జూన్ నెలలో మీ షో యాప్ లో ఒక లైటర్ పిస్టల్ కొనుగోలు చేశాడు. తన స్వంత అన్న అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తుడటంతో తరచూ అక్కడి వెళ్లేవాడు. ఈ క్రమంలో 4వ అంతస్తులో డాక్టర్ దంపతులు, పెద్దావిడ ఉండటం గమనించాడు. ఈనెల 14న అన్నకు తెలియకుండా అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన రవి పెద్దావిడ ఇంట్లో దూరి గన్ తో బెదిరంచి బంగారం వస్తువులు తీసుకొని, పెద్దావిడను బాత్ రూంలో బంధించి వెళ్లి పోయ్యాడు.
ఏసీపీ సురేందర్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ భాను ప్రకాష్ ప్రత్యేక టీం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గురువారం నిందితుడు రవిని అరెస్టు చేశారు. నిందితుని వద్ద లైటర్ పిస్టల్, బంగారు లాంగ్ చైన్, చిన్న చైన్, లాకెట్, 2 బంగారు గాజులు, బైక్ 2 సెల్ ఫోన్స్, మారు వేషం కోసం ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేధించడంలో కీలక పాత్ర వహించిన సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ భాను ప్రకాష్, క్రైమ్ వర్టికల్ సిబ్బంది యం.డి. అఫ్జల్, మంత్రి శ్రీనివాస్, ముత్తంగి స్వామి, సీసీఎస్ కానిస్టేబుల్స్ కిషన్, నర్సింహులు, ఐటీ కోర్ టీమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, సీసీ కెమెరామానిటర్ కానిస్టేబుల్ జగన్ లను సీపీ అభినందించి త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు. ఇండ్లలో, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.