- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి కనుసన్నల్లోనే ప్రశ్నాపత్రం లీకేజీ
దిశ, ఆందోల్: బండి సంజయ్ కనుసన్నల్లోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని, ఆయన పైన కూడా సిట్ విచారణ జరిపించాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పేపర్ల లీకేజీకి ఆజ్యం పోస్తుంది బీజేపీ నాయకులేనని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీకి తెరలేపింది బండి సంజయేనని అన్నారు. సమావేశంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఎంపీపీ బాలయ్య, పుల్కల్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్, ఎత్తిపోతల పథకం చైర్మన్ లింగాగౌడ్, మాజీ జడపీ విప్ నారాయణ, నాయకులు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.