ప్రైవేటీకరణతో దేశానికి ప్రమాదం పొంచి ఉంది: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్

by Shiva |
ప్రైవేటీకరణతో దేశానికి ప్రమాదం పొంచి ఉంది: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్
X

దిశ, హుస్నాబాద్: మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణతో యావత్ కార్మిక లోకంప్రమాదంలో పడే అవకాశం ఉందని, అదేవిధంగా దేశానికి ప్రమాదం పొంచి ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, బీఆర్టీయూ రాష్ట్ర ఇన్ చార్జి రూప్ సింగ్ అన్నారు. శనివారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘ నాయకులు, మహిళలతో మే డే వేడుకలపై సమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ 137 ఏళ్ల క్రితం కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలు తిరిగి బీజేపీ పాలనలో పునరావృత్తం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 48 కార్మిక చట్టాలను పార్లమెంట్ లో ఒకే కుదుపుతో 4 లేబర్ కోడ్ లకు కుదించి కార్మికుల జీవితాల్లో దుర్భర పరిస్థితులను తీసుకువచ్చే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పూర్తిగా తుడిచి వేయాలనే కుట్రతో బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. అందుకే 137 వ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ కార్మిక వర్గంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి జెండా ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed