- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..
దిశ, పెద్ద శంకరంపేట్ : దళారులకు ధ్యానం అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి అన్నారు. శనివారం పెద్ద శంకరంపేట మండలం జుక్కల్ ఐకేపీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసామని, పాసు బుక్కు, ఆధార్ కార్డు తప్పొప్పులు ఉన్నాయి. సరిచేసి అవి కూడా రుణమాఫీ బ్యాంకు అధికారులు త్వరలోనే పూర్తి చేస్తారని తెలిపారు. రైతులను ఆదుకోవాలని దృష్టిలో ఉంచుకొని మొదట్లోనే రైతు రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని సంకల్పంతో ఉన్నారని తెలిపారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాలో రైతులను పట్టించుకున్న దాఖలు లేవన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి అన్ని నెరవేరుస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక కృషి చేస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం, రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరను అందిస్తాం, రైతులకు అన్ని విధాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పేట తహశీల్దార్ గ్రేసీ బాయ్, మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది గోపాల్, కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, దాచ సంగమేశ్వర్, ఆర్యన్ సంతోష్ కుమార్, దానంపల్లి నారా గౌడ్, రాజన్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.