- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
culvert : ఇక్కడ అప్రమత్తం.. ఆదమరిస్తే అంతే సంగతి..
దిశ, జహీరాబాద్ : ఇక్కడ అప్రమత్తంగా లేకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. అల్లానా బైపాస్ రోడ్డులో పురాతన కల్వర్టు ప్రమాదకరంగా పరిణమించింది. ఎక్కడెలా ఉన్నా ఇక్కడ మాత్రం ఆదమరిచి ప్రయాణిస్తే అంతే సంగతి. ప్రమాదం కొనితెచ్చుకున్నట్లేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని మురుగునీటి కాల్వ పై నిర్మించిన కల్వర్టుకు ఇరువైపులా సైడ్ వాల్స్ లేక ప్రమాదకరంగా మారింది. కల్వర్టుకు ఇరుపక్కల గోడలు నిర్మాణంలో అధికారుల అలసత్వం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. కల్వర్టు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే వారే కరువయ్యారు.
జహీరాబాద్ పట్టణ బైపాస్ రోడ్డులో అల్గోల్ క్రాస్ నుంచి బీదర్ వెళ్లేందుకు వయా అల్లానా కర్మాగారం మీదుగా పురాతన బైపాస్ రోడ్డు ఉంది. ఈ రోడ్డులో భరత్ నగర్, అల్గోల్, పొట్పల్లి, కొత్తూర్( బి) దిడిగి తదితర గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక బీదర్ వెళ్లే ప్రయాణికులు సైతం ఈ బైపాస్ రోడ్డులోనే ప్రయాణం సాగిస్తారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ రోడ్డులో రాత్రిపూట ప్రయాణం అత్యంత ప్రమాదకరమని భరత్ నగర్ వాసులు పేర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహన లైట్లకు రోడ్డు సక్రమంగా కనిపించక ప్రమాదానికి గురికావాల్సిందేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక నెపంతో కాలయాపన చేయకుండా ప్రయాణికులు ప్రమాదాలకు గురికాకుండా సైడ్ వాల్స్ నిర్మించాలని, అంతవరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.