పదవిలో చేసిన పనులతోనే ప్రజల్లో గుర్తింపు : ఎమ్మెల్యే సునీత రెడ్డి

by Aamani |
పదవిలో  చేసిన పనులతోనే ప్రజల్లో  గుర్తింపు : ఎమ్మెల్యే సునీత రెడ్డి
X

దిశ, శివ్వంపేట : పదవిలో చేసిన పనులతోనే ప్రజల్లో గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట ఎంపీపీ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని మండలానికి మంచి గుర్తింపు తెస్తూ అభివృద్ధిలో మండలానికి అవార్డులు తీసుకున్న పాలకవర్గానికి అభినందనలు తెలియజేస్తున్న ట్లు ఆమె అన్నారు. అంతకుముందు ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు సహకరించిన ప్రజా ప్రతినిధులు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు.

అనంతరం ఎంపీటీసీలకు మెమెంటో ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోప్షన్ సభ్యులు మన్సూర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, తహసిల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా , పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ రాధిక లక్ష్మి, మిషన్ మిషన్ భగీరథ డి ఈ ప్రవీణ్, నీటి సరఫరా విభాగం డీఈ కిషన్, ఎంఈఓ బుచ్చ నాయక్, వ్యవసాయ అధికారి లావణ్య, డాక్టర్ సాయి సౌమ్య , గ్రామ పంచాయతీ కార్యదర్శిలు , వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed