- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA : నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి..
దిశ, దుబ్బాక : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయనిధి చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ఆదివారం దుబ్బాక పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 300 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతో సహాయపడుతుందని అన్నారు. ఎవరైనా పేదవారు అనివార్య పరిస్థితులలో ప్రవేట్ ఆసుపత్రులలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారికోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ కు ధీటుగా వైద్యసేవలు అందిస్తున్నారని, ఈ సేవలను పేదవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. అనంతరం దుబ్బాక శ్రీ బాలాజీ ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కరపత్రం ఇచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత భూంరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, వివిధ మండలాలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.