- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కలెక్టర్ హత్యకు కేటీఆర్ కుట్ర.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దిశ, జహీరాబాద్ : రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడ్డారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన జహీరాబాద్ లో ఉజ్వల్ రెడ్డి నివాసంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిన కేసీఆర్ కేవలం స్నో, పౌడర్ ఖర్చులకే రూ.50 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. అధికారం పోయిన రెండో రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం ప్రారంభించరని ధ్వజమెత్తారు.
మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వం పై రోజు దుమ్మెత్తి పోస్తున్నాడని, ఇది కాస్త లగచర్లలో పరాకాష్టకు చేరిందన్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక గులాబీ శ్రేణుల కుట్ర పన్నారని, ఇందులో భాగంగా కలెక్టర్ ను హత్య చేసేందుకు కేటీఆర్ సురేష్ తో పాటు మరో 19 మందిని నియమించారని ఆరోపించారు. ఈ విషయం స్వయంగా కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని, పైసా పైసాకు కూడబెట్టి ఓ వైపు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సంవత్సరం12 వేల కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేయనున్నామన్నారు.