- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కాళేశ్వరం ఘనత ఢిల్లీ నాయకులకు కనబడుతలేదా.. వినబడుతలేదా..'
దిశ, మనోహరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో గడిచిన ఎనిమిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందిస్తుండడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు కాళేశ్వరం నుంచి చుక్క నీరు రావడం లేదని, పంటలు పండటం లేదని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఢిల్లీ పెద్దలకు కండ్లు ఉన్న కనబడడం లేదా.. చెవులు ఉన్నా వినబడడం లేదా.. అని మంత్రి మండిపడ్డారు.
శుక్రవారం మండల కేంద్రమైన మనోహరాబాద్‌లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరమ్ కన్వీనర్, స్థానిక సర్పంచ్ చిట్కుల్ మహిపాల్ రెడ్డి అధ్యక్షతనలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మండలంలో నూతనంగా 584 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌లు మంజూరు కావడంతో మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటు, నిరుపేదలకు పంపిణీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వరాదంటూ మాట్లాడడం మంచి పద్ధతి కాదని వారికి హితవు పలికారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో గడిచిన 8 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలు అందిస్తూ నిరుపేదలను కడుపులో పెట్టుకొని కాపాడుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ద్వారా హల్దీ వాగులోకి ఎండాకాలంలో నీటిని విడుదల చేసి పంటల సాగుకు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని 3 జిల్లాల ఏర్పాటు వల్ల ఒక్క మెదక్ జిల్లాలోనే కాళేశ్వరం సాగునీటితో 5 .50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారని మంత్రి తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో కులం, మతం లేదని అన్నారు. కొన్ని శక్తులు కులాలు, మతాల పేరా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని మండి పడ్డారు. గడిచిన టీడీపీ హాయంలో చంద్రబాబు, కాంగ్రెస్ పాలనలో నిరుపేదలకు అరకొరగా పింఛన్‌లు ఇచ్చారని, సీఎం కేసీఆర్ పాలనలో పూర్తి స్థాయిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, గీత, చేనేత కార్మికులకు అందిస్తున్న ఆసరా పింఛన్‌లతో లబ్ధిదారులు ధైర్యంగా బతుకుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
వారం, పది రోజుల్లో మనోహరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ లను అసలైన నిరుపేదలను గుర్తించి లిస్ట్ తయారు చేస్తే త్వరలోనే ఇండ్లు మంజూరు చేసి దసరా పండుగ వరకు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ హరీష్ ను ఆదేశించారు. ఇండ్లు లేక స్థలాలు ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం రూ.3 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ సి యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఎంపీపీ పురం నవనీత, ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి , రైతు సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ లు రమేష్, ప్రతిమ సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మండలం లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.