మెదక్‌కు మెడికల్ కళాశాలకు అనుమతి..!

by Aamani |
మెదక్‌కు మెడికల్ కళాశాలకు అనుమతి..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతి వచ్చింది.. వైద్య విధాన పరిషత్ పలు మార్లు పరిశీలించినా అనుమతి ఇవ్వలేదు.. అధికారులు పట్టుదలతో చేసిన కృషికి ఎట్టకేలకు మెదక్ కు మెడికల్ వైద్య కళాశాల మంజూరు చేసింది.. మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల కోసం గత ప్రభుత్వంలో మంజూరు జరిగింది. ఎన్నికల కు ముందు అప్పటి మంత్రి హరీష్ రావు, అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. జరిగిన ఎన్నికల్లో బీ అర్ ఎస్ ఓడిపోవడం తో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వం లో మంజూరైన మెడికల్ కళాశాల అనుమతి ల పై అందరిలో ఆందోళన నెలకొంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కళాశాల అనుమతుల కోసం తీవ్రంగా కృషి చేశారు. పాత కలెక్టరేట్ లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ ను వేరే చోటికి మార్చి మెడికల్ కళాశాల కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

కానీ పరిశీలనకు వచ్చిన వైద్య విధాన పరిషత్ అనుమతి ఇవ్వడంతో తీవ్ర జాప్యం చేసింది. వైద్య కళాశాలకు అవసరమైన సౌకర్యాలు లేని మూలంగా అనుమతి రాలేదు. ఒక వైపు మెడికల్ కౌన్సిల్ జరిగే వేళ జాతీయ వైద్య విధాన పరిషత్ అనుమతి ఇవ్వకపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఇటీవల మెదక్ జిల్లా సమీక్షకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకు వెళ్లారు. దీనితో ప్రత్యేక కృషి ఫలితంగా మెదక్ ప్రజలు ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య విధాన పరిషత్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

మెరుగైన అధునాతన వైద్యం: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కృషి వల్ల మెదక్ జిల్లాలకు మెడికల్ కళాశాల అనుమతి వచ్చినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మార్గదర్శకం లో అధికారులు పట్టుదల, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అందరూ కళాశాల అనుమతికి కృషి చేశారని చెప్పారు. మెడికల్ కళాశాల వల్ల జిల్లా ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. మెడికల్ కళాశాల అనుమతికి కృషి చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు

Advertisement

Next Story

Most Viewed