Minister Duddilla Sridhar Babu : దైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్న ..

by Sumithra |
Minister Duddilla Sridhar Babu : దైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్న ..
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఆదివారం సాయంత్రం కస్తూర్బా బాలికల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థినులను హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ( government hospital ) తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ( Minister Duddilla Sridhar Babu ) ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినిలను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినుల ఆరోగ్యం గురించి, వారికి అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఒక్కొక్క విద్యార్థిని ఆరోగ్యం గురించి అడుగుతూ నేను ఉన్న మీకు ఏమి కాదు భయపడద్దు. ఆందోళన చెందొద్దు దైర్యంగా ఉండండి అని భరోసానిచ్చారు. ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆసుపత్రి డాక్టర్ లకు మంత్రి సూచించారు.

Next Story