Crime news : తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అక్క గుండె..

by Sumithra |
Crime news : తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అక్క గుండె..
X

దిశ, మల్యాల : తమ్ముడి మృతి తట్టుకోలేక గుండెపోటుతో (Heart attack) అక్క మృతి చెందిన విషాదకర ఘటన తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపల్లి గ్రామానికి చెందిన పిల్లి జలపతి (60) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన చింత రాజవ్వ (70)తన సోదరుని మృతదేహం వద్ద రోధిస్తూ అస్వస్థకు గురై ఆదివారం మృతి చెందింది. తమ్ముడి మృతి తట్టుకోలేక అక్క హఠాత్ మరణంతో తాటిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed