- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైభవంగా మంజీరా పుష్కరాలు ప్రారంభం
పుణ్య స్నానం చేసిన ఎమ్మెల్సీ దంపతులు.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
దిశ, మెదక్ ప్రతినిధి: మంజీర పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మెదక్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు మంజీర పుష్కర స్నానం చేశారు. మెదక్ మండలం పేరుర్ లోని సరస్వతి ఆలయం సమీపంలో గరుడ గంగ మంజీర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంజీర లో ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి మంజీర పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తారు. మంజీర పుష్కరాలను శనివారం ఉదయం మధవనంద స్వామి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మొదటి రోజు పుష్కరాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుష్కర ఘాట్ వద్ద పూజలు చేశారు. ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి దంపతులు పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మంజీర పుష్కర స్నానం చేసి పునీతులు కావాలన్నారు. మనకు గోదావరి, కృష్ణ పుష్కరాలు జరుగుతాయని, మన చెంతే ఉన్న మంజీర పుష్కర స్నానం చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో మొదటి సారిగా పుష్కరాలు వచ్చాయని, భక్తులు పుణ్య స్థానం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అనంతరం శేరీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో మంజీర పుష్కరాలను అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రారంభించాలని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు. 12 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో రెండో విడత పుష్కరాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. పురాణాలు చెప్పిన విధంగా పుష్కర స్నానం వల్ల పూర్వీకులు ఆత్మకు ముక్తి కలుగుతుందని అన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మండు వేసవిలో జరుగుతున్న మంజీరా పుష్కరాలకు సరస్వతి ఆలయ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజమౌళి శర్మతో పాటు బీఆర్ఎస్ నేతలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్, రామకృష్ణ, గ్రామ సర్పంచ్ జానకి రెడ్డి, సర్పంచ్ లు మహిపాల్ రెడ్డి, యామిరెడ్డి, నోముల శ్రీకాంత్, సాయ గౌడ్, శ్రీను నాయక్, ఎంపీటీసీ చిట్యాల శ్రీనివాస్, యువ నాయకులు ప్రశాంత్, తదితరులు ఉన్నారు.