యువతి పై అసభ్యకర పోస్టులు... వ్యక్తి అరెస్టు

by Kalyani |
యువతి పై అసభ్యకర పోస్టులు... వ్యక్తి అరెస్టు
X

దిశ, ఝరాసంగం/రాయికోడ్ : యువతితో చనువుగా ఉంటూ ఫోటోలు దిగి అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి..యువతి తో పెండ్లి కుదిరిన వ్యక్తికి, బంధువులకు సోషల్ మీడియా ద్వారా తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లో చోటుచేసుకుంది. జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన మహమ్మద్ మక్సూద్ ఓ యువతితో చనువుగా ఉంటూ ఫోటోలు దిగి ఫోటో, వీడియో, మార్పింగ్ చేసి యువతకి కాబోయే భర్తకు, బంధువులకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు వారు తెలిపారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్లే యువతి పెండ్లి చెడిపోయిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన మక్సూద్ పై సెక్షన్ 35 బిఎన్ఎస్ఎస్ ( భారతీయ నాగరిక సురక్ష సంహిత) కింద కేసు నమోదు చేశామన్నారు. మక్సుద్ తన ఇంటి వద్ద ఉన్నట్లు సమాచారంతో వ్యక్తిని అరెస్ట్ చేసి జహీరాబాద్ మున్సిఫ్ కోర్టుకు తరలించినట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story