హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : నర్సాపూర్ ఎమ్మెల్యే

by Aamani |
హామీల  అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : నర్సాపూర్ ఎమ్మెల్యే
X

దిశ, నర్సాపూర్ : హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తా లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. చౌరస్తా వద్ద మానవహారం నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ ఏటా రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని ఏడాది పాటు ఊరించి చివరకు 12 వేలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి మోసానికి నిరసనగా రైతు డిక్లరేషన్ కాపీకి, గ్యారెంటీ కార్డులకు శవ యాత్ర నిర్వహించి గొయ్యి తీసి బొంద పెట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తో పాటు నియోజకవర్గంలో ఆయా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story