దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ

by Naveena |
దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ
X

దిశ, గుర్రంపొడు: గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో దిశ దినపత్రిక నూతన సంవత్సర 2025 క్యాలెండర్లను అడిషనల్ ఎస్పీ మౌనిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ..ఎప్పటి వార్తలు అప్పుడు అందిస్తూ పత్రిక రంగంలో దిశ చురుకైన పాత్ర వహిస్తుందని, ప్రభుత్వం సంబంధించిన వార్తలు క్షణాల్లో అందరికీ అందిస్తూ అందరి మన్ననలను పొందిందని అన్నారు. పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు,ప్రభుత్వానికి, సమాచారం అందిస్తుంది అన్నారు. ఈ ఏడాదిలో కూడా దిశ ఇదే చూపుతో సమాజానికి ఉపయోగపడే కథనాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐ ధనుంజయ గౌడ్, ఎస్సై పసుపులేటి మధు, ట్రైనింగ్ ఎస్సై, దిశా రిపోర్టర్ పరమేష్, గాలి కొండలు, కొండ్రపల్లి గిరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story