GHMC: అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లిన జీహెచ్ఎంసీ వాహనం

by Ramesh Goud |
GHMC: అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లిన జీహెచ్ఎంసీ వాహనం
X

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ వాహనం(HMC Vehicle) అదుపుతప్పి వాహనాల మీదికి దూసుకెళ్లిన ఘటన మల్లాపూర్(Mallapur) లో జరిగింది. ఘటన ప్రకారం నాచారం పీఎస్(Nacharam Police Station) పరిధిలోని మల్లాపూర్ లో జీహెచ్ఎంసీ క్లీనింగ్ వాహనాన్ని(Cleaning Vehicle) డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి, పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లాడు. ఇంజన్ స్టార్టింగ్ లోనే ఉండటంతో అకస్మాత్తుగా వాహనం కదలి, రోడ్డు మీదుగా వెళ్లడం ప్రారంభించింది. ఇది గమణించిన డ్రైవర్ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రయత్నం విఫలం అయ్యి, క్లీనింగ్ వాహనం డ్రైవర్ సహా పార్కింగ్ లో ఉన్న వాహనాల మీదికి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా.. రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృష్యాలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story