మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

by Naveena |
మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ , మిర్యాలగూడ టౌన్ : మహ్మిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంపులో ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా మంజూరైన దుర్గాదేవి క్యాంటిన్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరా మహిళ శక్తి పథకంతో మహిళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళ లు సొంతంగా వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. స్వయం ఉపాధిలో మహిళ లు ముందుండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ యూసుఫ్ అలీ , నాయకులు పొదిల శ్రీనివాస్ ,బాలకృష్ణ ,అమృతరెడ్డి , నర్సిరెడ్డి ,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story