HMPV వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
HMPV వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న HMPV వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇవాళ ఒకేరోజు నాలుగు కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, కోల్‌కతాలో ఒక కేసు నమోదు అయింది. తాజాగా.. ఈ HMPV వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జేపీ నడ్డా(JP Nadda) సూచించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ధీటుగా ఎదుర్కొందాం అని ధీమా వ్యక్తం చేశారు. HMPVపై కేంద్రం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఇది కొత్త వైరస్ కాదని.. 2001లోనే గుర్తించినట్లు స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారినపడే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెప్పుకొచ్చారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

Advertisement

Next Story