- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Stock Market: హెచ్ఎంపీవీ వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో మరోసారి వైరస్ భయాలు పెరిగాయి. ఇటీవల చైనాలో విజృంభించిన కొత్త హెచ్ఎంపీవీ వైరస్‌కు సంబంధించి సోమవారం భారత్‌లోనూ కేసులు నమోదవడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికితోడు భారత ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడం, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి వంటి అంశాల కారణంగా సోమవారం ర్యాలీలో సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు పతనమయ్యాయి. ఉదయం మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, హెచ్ఎంపీవీ వైరస్ ఆందోళనలు అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపడంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనపడి, దానివల్ల మన మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడంతో మిడ్-సెషన్ తర్వాత కుదేలయ్యాయి. కర్నాటకలో రెండు హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు, గుజరాత్‌లో ఒక కేసును భారత ప్రభుత్వం ధృవీకరించిన తర్వాత, దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర భయాందోళనల పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మార్కెట్ల నుంచి రూ.11 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.
వైరస్ కాకుండా అమెరికా కొత్త ఆర్థిక విధానాల చుట్టూ నెలకొన్న అనిశ్చితులు, భవిష్యత్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ద్రవ్యోల్బణం, బలపడుతున్న డాలర్ వంటి అంశాలు భారత మార్కెట్ల ర్యాలీని బలహీనపరిచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు పతనమై 77,964 వద్ద, నిఫ్టీ 388.70 పాయింట్లు క్షీణించి 23,616 వద్ద ముగిశాయి. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు 2-5 శాతం మధ్య దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, జొమాటో, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్. ఐటీసీ వంటి స్టాక్‌లు సెన్సెక్స్‌లో 4.41 శాతం వరకు పడిపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.61 వద్ద ఉంది.