పేదల పాలిట దేవుడు కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

by Naresh |   ( Updated:2023-09-16 16:38:50.0  )
పేదల పాలిట దేవుడు కేసీఆర్ : మంత్రి హరీష్ రావు
X

దిశ, కొండాపూర్: దేశంలో ఎక్కడ లేని విధంగా పెదింటి ఆడబిడ్డల పెళ్ళిల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ గోకుల్ ఫంక్షన్ హాల్ లో అర్హులైన లబ్ధిదారులకు రూ.1,00,116-/ పంపిణీ చేశారు. అదేవిధంగా G.O 58 ప్రకారం దివ్యాంగులకు గతంలో పింఛన్ కంటే ప్రస్తుతం ఎక్కువగా కేటాయించి, సర్టిఫికెట్లను అందజేశారు. ముస్లింలకు, క్రైస్తవులకు స్మశాన స్థలాలను 6 ఎకరాలు వేరువేరుగా కేటాయించడం జరిగిందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మైనార్టీలకు రూ.1,00,000-/ ఎటువంటి సబ్సిడీ లేకుండా వారి అభివృద్ధి కొరకు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ది అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ప్రైవేటు హాస్పిటల్ అప్పుల పాలు అయితుండేవారని, బీఆర్ఎస్ పాలనలో నేడు గవర్నమెంట్ హాస్పిటల్ లో 85% ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్ ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి దశలో ఉన్నత స్థాయి చేరుకోవడానికి, అనేక రాష్ట్రాలు తెలంగాణలోని ఉన్న సంక్షేమ పథకాలు కోరుకునే విధంగా, సంగారెడ్డి అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ కే సాధ్యమన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ అన్నారు.




అందుకే ప్రజలు కేసీఆర్ ని రెండవసారి ఆశీర్వదించారు. మూడవసారి ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా గత కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగ్గా వచ్చేది కాదంటూ నేడు 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ చైర్మన్ చింత ప్రభాకర్, ఎమ్మెల్యే సత్యనారాయణ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, జైపాల్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, రషీద్, లాడే మల్లేశం, మల్ల గౌడ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed