ఎవరిని గెలిపించాలో.. ప్రజలే తేల్చుకోవాలి : కేసీఆర్

by Vinod kumar |   ( Updated:2023-11-18 13:40:06.0  )
ఎవరిని గెలిపించాలో.. ప్రజలే తేల్చుకోవాలి : కేసీఆర్
X

దిశ సిద్దిపేట ప్రతినిధి/ చేర్యాల/మద్దూరు: కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా జనగామ నియోజకవర్గ పరిధిలోని పరిధిలోని చేర్యాలలో శనివారం ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్ర బాబు నాయుడుకి చెంచాగిరి చేసే రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారా అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కడుగు పీడిత ప్రాంత జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలకు చేసుకున్నట్లు తెలిపారు. మరోసారి అధికారంలోకొస్తే పెన్షన్ రూ. 5000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్ రెండు వేలు ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సాగుకు నీటినందిస్తే నీటి పన్ను వసూలు చేస్తారని.. వ్యవసాయ స్థిరీకరణ కోసం తెలంగాణలో నీటి తీరువాను రద్దు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులు బాగుపడాలని వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు రైతు బీమా సాగుకు 24 గంటలు ఉచిత కరెంటు అందించడంతో పంజాబ్ రాష్ట్రాన్ని మించి తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి వ్యవసాయానికి ఐదు గంటల కరెంటు ఇస్తామని ప్రకటించారని.. తెలంగాణలో ఇప్పటికే 24 గంటల విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. నేత బట్టి విక్రమార్క ధరణి తీసేస్తామని ప్రకటిస్తున్నారని.. ధరణి రద్దయితే తిరిగి దళారుల రాజ్యమే వస్తుందన్నారు. వ్యవసాయ బావులకు 10 హెచ్ పి మోటర్లు మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆయన దివాలా కొరతనానికి నిదర్శనం అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతుందని, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని చెబుతున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే వాళ్ల.. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇచ్చే వాళ్ళ.. 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదన్నారు. ఎన్నికలు వస్తే కొట్లాడుడు.. కత్తులు పట్టి పొడుచు కుంటున్నారన్నారు. అభ్యర్థుల గుణగణాలు పార్టీ చరిత్ర చూసి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి గుణగణాలు పార్టీ చరిత్రపై గ్రామాల్లో చర్చ జరిగినప్పుడే మంచి ప్రభుత్వాలు ఏర్పడి మేలు జరుగుతుందన్నారు.

50 ఏళ్లలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో.. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ తెలంగాణకు ఏం చేసిందో ప్రజల ముందు ఉందన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. దీనికి తోడు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పాలకులు అన్నిచి వేసే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయం ప్రధాని మోడీ మంజూరు చేయలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్ర లో పోటీ చేస్తానని భయంతో కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. చేర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశారని.. పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం అంతకుమించి అభివృద్ధి చేస్తారని తెలిపారు. చేర్యాలకు ఇంజనీరింగ్ కాలేజ్, వివిధ విద్యాసంస్థలను తీసుకొచ్చి విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీని ఇచ్చారు.

Advertisement

Next Story