- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోండి.. సీఐకు జర్నలిస్ట్‌ల ఫిర్యాదు
దిశ, మెదక్ ప్రతినిధి: జర్నలిస్ట్‌ను దూషించిన కాంగ్రెస్ నేతపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ జర్నలిస్టులు పట్టణ సీఐ మధు కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు పత్రిక స్వేచ్ఛను హరిహస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని, రైతు రుణమాఫీ చేయాలని, పొడుభూముల సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్ నిరసన చేపడితే ఆ కార్యక్రమంలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో అట్టర్ ప్లాప్ అనే కథనాన్ని జర్నలిస్ట్ ప్రచురించడం జరిగిందన్నారు. దీంతో సహనం కోల్పోయిన పాపన్నపేట మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి జర్నలిస్ట్‌ను దూషించడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత దూషణలకు దిగితే కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ జర్నలిస్టులు పని చేస్తారే తప్పా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని వారు స్పష్టం చేశారు. కొందరు జర్నలిస్టులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని, అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ పై బురదజల్లే వార్తలు రాస్తున్నారని కాంగ్రెస్ నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సదరు జర్నలిస్ట్‌కు క్షమాపణ చెప్పలని వారు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజెయూ) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, టీయుడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు వికాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బొందుగుల నాగరాజు, టీయుడబ్ల్యూజే (హెచ్ 143)జిల్లా నేత సురేందర్ రెడ్డి, జర్నలిస్టు సంఘాల నేతలు కామాటి కిషన్, వెంకటేష్, వీర్ కుమార్, సంగమేశ్వర్, రాజగౌడ్, రఘు, కార్తీక్, సఫ్దర్, మహ్మద్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.