- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ స్తంభం ఎక్కిన వ్యక్తికి జైలు శిక్ష.. ఎందుకంటే..
దిశ, సిద్దిపేట ప్రతినిధి: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తూ, విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 12 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన గద్దల కుమారస్వామి గత సోమవారం సాయంత్రం ప్రజలను ఇబ్బంది గురి చేసేలా ప్రవర్తిస్తూ పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
స్థానికుల సమాచారం మేరకు కుమారస్వామిని విద్యుత్ స్తంభంపై నుంచి కిందకు దించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా గద్దల కుమారస్వామికి 12రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కుమారస్వామి గతంలో సైతం ఇలానే ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.