జిల్లాలో 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు : ఎస్పీ ఎం.రమణ కుమార్

by Shiva |
జిల్లాలో 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు : ఎస్పీ ఎం.రమణ కుమార్
X

దిశ, సంగారెడ్డి : జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు ఆగస్టు 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్, 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం.రమణ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

ప్రజాధనానికి నష్టం కలిగించే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పైన తెలిపిన చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed