దుబ్బాక మండలంలో అక్రమంగా కలప రవాణా..!

by Mahesh |
దుబ్బాక మండలంలో అక్రమంగా కలప రవాణా..!
X

దిశ, దుబ్బాక : ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెట్లను నాటుతూ హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు మండలంలో చెట్లను నరుకుతూ జోరుగా కలపను తరలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో శనివారం దిశ కెమెరాకు కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనం చిక్కింది. రాఘోత్తంపల్లి గ్రామం నుంచి రామక్కపేట గ్రామ మధ్యలో కలపను ట్రాక్టర్‌లోడ్ చేసుకుని పట్టపగలే ప్రధాన రహదారిపై తరలిస్తున్నారు. ఆ వాహనానికి ఎలాంటి నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా కలప అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కలపను అక్రమార్కులు రాత్రికి రాత్రే చెట్లను నరికి పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా అటవి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు మామూళ్ల మత్తులో ఉండి అక్రమ కలప రవాణా చేస్తున్న వ్యక్తులకు అటూ టింబర్ డిపో యజమానులకు వత్తాసు పలుకుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story