- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రణాళికతో చదివితే.. విజయంమే : కలెక్టర్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : విజేతలను ఆదర్శంగా తీసుకొని ప్రణాళిక బద్ధంగా చదివి విజయాలను అందుకోవాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి యువతకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కేడం లింగ మూర్తి తో కలిసి కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ప్రతి రోజు చదివితే లక్ష్యం దరి చేరుతుందన్నారు. డా. బీ ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదువు కోవాలని సూచించారు. టీజీ పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, ఇతర ఉద్యోగ అర్హత పరీక్షలకు ప్రణాళిక బద్దంగా ప్రిపేర్ కావాలన్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష, ఎలా ప్రిపేర్ కావాలి తదితర అంశాలను కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లైబ్రరీ లో అవసరమైన వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ...దుబ్బాక మిరుదొడ్డి గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల సంబంధించిన పుస్తకాలతో పాటుగా వసతుల కల్పించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. సిద్దిపేట లైబ్రరీలో రీడర్స్ కోసం అదనపు గది, టాలెంట్స్, ప్రహారీ గోడ నిర్మాణం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూజల హరికృష్ణ, ముద్దం లక్ష్మీ, అత్తు ఇమామ్, బొమ్మల యాదగిరి, అలకుంట మహేందర్, కలీమోద్దీన్, గ్రంథాలయ అధికారులు, విద్యార్థులు, రీడర్స్ తదితరులు పాల్గొన్నారు.