- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ పోయే అంటూ సిద్దిపేటలో వెలసిన ఫ్లెక్సీలు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ యువసేన పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణ మాఫీ అన్నదాతల రుణ విముక్తి పండగ.. రైతన్నల ముఖాల్లో చిరునవ్వుగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంతన్న సర్కార్, దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే హరీష్ రావు అని ఉన్న ఫ్లెక్సీలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైతు బజార్, బీజేఆర్ చౌరస్తా ఇలా ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్‌లు ప్రతి సవాల్‌ల నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ఆంశం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఫ్లెక్సీల విషయం బీజేఆర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల నాయకులు పోటాపోటీ నినాదాలు చేయడం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.