- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, కృషితో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు వివిధ విభాగాల్లో 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని పాథాలజీ (1), మైక్రోబయోలజీ (1), కమ్యూనిటీ మెడిసిన్ (2), జనరల్ మెడిసిన్ (4), పిడియాట్రిక్ (3), డివిఎల్ (1), సైకియాట్రీ (1), రేడియాలజీ (1), జనరల్ సర్జరీ (4), ఆర్థోపెడిక్ (2), ఈఎన్‌టీ (1), గైనకాలజీ (4), అనస్థీషియా (3) తో పాటు మొత్తం 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ సందర్భంగా మంత్రిహరీష్ రావు మాట్లాడుతూ ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నదన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాలను తీసుకొచ్చి వైద్యవిద్యను చేరువ చేసినట్లు చెప్పారు. ఏకకాలంలో జిల్లాకు 28 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రిహరీశ్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు, వైద్యులు, వైద్య విద్యార్థులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.