- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుపేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
దిశ,పటాన్ చెరు : నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం కోసం స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీ ఎం ఆర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో సొంత స్థలం కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవద్దని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో మోడల్ హౌస్ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో సొంతింటి కలను సహకారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఐలేష్, తదితరులు పాల్గొన్నారు.