- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్నారం లో జాతీయ రహదారిపై పేరుకుపోయిన చెత్త
by Kalyani |
X
దిశ, గుమ్మడిదల :- అన్నారంలో జాతీయ రహదారిపై పేరుకుపోయిన చెత్త.. వాటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ పాడి పశువులు అనారోగ్య పాలవుతున్నాయి. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని బాలానగర్ మెదక్ జాతీయ రహదారి పై గత కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోతుంది. దీంతో ఈ మార్గాన ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక పాడి పశువుల సైతం ఈ చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ తీవ్ర అనారోగ్య పాలవుతున్నాయి. తద్వారా ప్రజలకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని పలువురు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచి తొలగించాలని.. చెత్తను రహదారిపై పారపోస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story