భవనాల మధ్యలో భారీగా మంటలు.. కిలో మీటర్ ఎత్తులో నల్లగా కమ్మిన పొగ (వీడియో)

by Mahesh |   ( Updated:2023-10-10 11:09:11.0  )
భవనాల మధ్యలో భారీగా మంటలు.. కిలో మీటర్ ఎత్తులో నల్లగా కమ్మిన పొగ (వీడియో)
X

దిశ, తూప్రాన్: భవనాల మధ్యలో భారీగా మంటలు చెలరేగి.. భారీ ఎత్తున నల్లని పొగ కమ్ముకుంది. ఈ భయానక సంఘటన తూప్రాన్ నర్సాపూర్ చౌరస్తాలో పాత ఎస్బీఐ బ్యాంక్ వెనకాల ఉన్న స్క్రాప్ దుకాణంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నల్లటి పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఆ స్క్రాప్ దుకాణం చుట్టు పక్కల భవనాలు, షాపింగ్ మాల్స్ ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed