ఎర్రవరం భూములకు మస్తు డిమాండ్..రూ.కోట్లలో పలుకుతున్న ధర

by samatah |
ఎర్రవరం భూములకు మస్తు డిమాండ్..రూ.కోట్లలో పలుకుతున్న ధర
X

ఒకప్పుడు ఆ గ్రామం మారుమూల ప్రాంతం.. కానీ ఇప్పుడు మహా పుణ్యక్షేత్రం. రోజూ ఎంతోమంది ఆలయానికి వస్తున్న భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోతున్నది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాలఉగ్ర నరసింహస్వామిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో ఆ గ్రామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ గ్రామమే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాచుర్యం పొందడంతో ఇదే ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కలిసొచ్చిన అంశం.. ఎర్రవరం గ్రామంలోని భూములు రూ.కోట్లల్లో ధరలు పలకడంతో ల్యాండ్ ధరలకు రెక్కలొచ్చాయని పలువురు చర్చించుకుంటున్నారు. గ్రామంలోని దూళ్లగుట్టపై బాల ఉగ్రనరసింహస్వామి స్వయంభుగా కొలువు తీరడంతో ఇలా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.

దిశ, కోదాడ : ఒకప్పుడు ఎర్రవరం గ్రామంలో రూ.30 లక్షలు ఎకరం ఉండేది. ప్రస్తుతం రూ.మూడు కోట్లకు పైగా అమ్ముడు పోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ఓ రైతు ఎర్రవరం గ్రామానికి సమీపంలో ఉండడంతో ఆ ఎకరాన్ని అమ్మగా రూ.రెండు కోట్ల 80 లక్షల రూపాయలు రావడంతో గ్రామంలో మూడు ఎకరాల కోన్నాడు అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ తెలుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా దేవాలయానికి రావడంతో రోడ్డు వెంబడి దుకాణాలు ఏర్పాటు చేయడం కొంతమంది వారికి వసతులు ఏర్పాటు చేయడం కోసం, మరి కొంతమంది వాహనాలు పార్కింగ్ కోసం వారి వ్యాపార అభివృద్ధి కోసం భూములను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం భూములు అమ్మడం కొనడం నిరుత్సాహంగా ఉంది అని యర్రవరం గ్రామంలో అమాంతం పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో భూములు అనేకమంది చేతులు మారాయి. ఏది ఏమైనా గాని భూములు అధిక ధరలు పలకడం గ్రామ అభివృద్ధి చెందడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అస్తవ్యస్తంగా పారిశుధ్యం

ఇరు రాష్ట్రాల నుంచి జనం తాకిడితో ప్రతిరోజు ఎర్రవరం గ్రామం కిక్కిరిసిపోతుంది. దీంతో దేవాలయ చుట్టుపక్కల అనేక షాపులు వెలిశాయి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కావడం. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో తాము భోజనం చేసిన ఇస్తరాకులతో సహా, వ్యర్థ పదార్థాలను ఇష్టం వచ్చినట్లుగా పడేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం కలుషితమైతుందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. అడ్డగోలు పార్కింగ్ శుక్రవారం సమయంలో విపరీతమైన రద్దీ ఉండడంతో కోదాడ మేళ్లచెరువు రహదారి అంతా జనమయంగా మారుతుంది. ఆంక్షలు లేకపోవడంతో పెద్దపెద్ద వాహనాలు సైతం వస్తూ ఉండడంతో శుక్రవారం తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడుతుందని. మేళచెరువు నుండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోదాడకు వచ్చే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు

వాక్కుల పేరుతో కొత్తదందాకు తెర

కోరిన కోరికలు తీరుస్తూ ఉండడంతో ఎర్రవరం ఆలయానికి భక్తులు సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. రెండు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో జనం తరలివస్తునడంతో ఎర్రవరం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారింది. కానీ ఇదే అదునుగా కొంతమంది వాక్కుల పేరుతో కొత్తదందాకు తెర లేపారు. రోజుకి లిమిట్ ఏర్పాటు చేసుకొని కేవలం ఒక వంద మందికి మాత్రమే వాక్కు చెబుతామని, ఒక్కొక్కరి నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుని వారి బలహీనతలను గుర్తించి వారి వద్ద నుండి భారీగానే నగదు వసూలు చేస్తున్నారు. ప్రత్యేకంగా వారు వాక్కు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ దందా కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో ఈ వాక్కు కేంద్రాలు ఏర్పాటు అయ్యా అంటే ఏ మేరకు దందా కొనసాగుతుందో అర్థమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత దేవాలయ కమిటీ వారు స్పందించి ఈ అక్రమ దందాతో పాటు పారిశుధ్యంపై పూర్తిస్థాయి లో చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed