- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పకడ్బందీగా సామాజిక సర్వే.. కలెక్టర్ రాహుల్ రాజ్..
దిశ, నిజాంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పదొవ వార్డులో నిర్వహిస్తున్న సామాజిక సర్వేను ఆయన పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వేను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారన్నారు.
సర్వేలో సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. సర్వే పై ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్వే 20% నుండి 30% వరకు పూర్తయిందన్నారు. పట్టణ, గ్రామాలలో ప్రజలు సర్వే అధికారులకు సహకరించి వారి వివరాలను తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రజనీకుమారి, ఆర్ఐ గౌసుద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి, శివరాజ్, కవిత అధికారులు పాల్గొన్నారు.