కుక్కల స్వైర విహారం..పరుగు పెట్టిస్తున్న వీధి కుక్కలు

by Aamani |
కుక్కల స్వైర విహారం..పరుగు పెట్టిస్తున్న వీధి కుక్కలు
X

దిశ,కంగ్టి : మండల వ్యాప్తంగా కుక్కలు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ గ్రామం , ఈ గ్రామం అనే తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు , సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకులను ఎక్కడో ఒక చోట వీధి కుక్కల వెంబడించి , గాయపరిచిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద సంఘటన జరగలేదు ఒకవేళ ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడే అధికారు స్పందిస్తారు కావొచ్చు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story