విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి

by Shiva |
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి
X

దిశ, పటాన్ చెరు: విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మీ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా అంకుడు గ్రామానికి చెందిన త్రినాథ రావు (50) బతుకు దేరువు కోసం వలస వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయ లక్ష్మీ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో పనికి వెళ్లాడు.

ఆ భవనానికి ప్లాస్టింగ్ చెయ్యడానికి కర్రలతో గోవా నిర్మాణం చేస్తుండగా కర్ర పక్కనే ఉన్న హై టెన్షన్ వైర్లపై పడడంతో విద్యుత్ షాక్ తో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు త్రినాథ రావును బీరంగూడ కామన్ వద్ద పనేసియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు సోదరుడు రాంబాబు ఫిర్యాదు మేరకు అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story