మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..

by Sumithra |
మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..
X

దిశ, చేర్యాల : చేర్యాల మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు, మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.సురేష్, ఏ.రాంమల్లయ్య మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులు శానిటేషన్, మంచినీటి సమస్యతో పాటు సమయానికి భోజనం పెట్టడం లేదని ఆరోపించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలని ప్రిన్సిపాల్ ను కోరారు. ఏ విషయమై కళాశాల ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తానని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు టి.కుమారస్వామి, రాష్ట్ర నాయకులు కొండ్ర లావణ్య, అనంతుల కల్పనతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed