విద్యాలయాలు మందుబాబుల నిలయాలు..

by Aamani |
విద్యాలయాలు మందుబాబుల నిలయాలు..
X

దిశ,జనగామ : జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్​​ గ్రామంలో విద్య, వైద్యాలయాలు మందుబాబులకు నిలయాలుగా మారుతున్నాయి. గ్రామంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో యువకులు అక్కడ లిక్కర్​ కొనుక్కొని ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తున్నారు. గ్రామంలోని అంగన్​వాడీ సెంటర్​, ప్రభుత్వ పాఠశాల, పల్లె దవాఖాన ఆవరణలో సాయంత్రం అయ్యిందంటే చాలు మందుబాబులు దర్జాగా సిట్టింగ్​ చేస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి మందుబాబుల ఆగడాలకు చెక్​ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed