కిక్కిరిసిన ముంబై వీధులు.. T-20 వరల్డ్ కప్ విజేతలకు కనివిని ఎరుగని రీతిలో గ్రాండ్ వెల్‌కమ్

by Satheesh |   ( Updated:2024-07-04 13:31:10.0  )
కిక్కిరిసిన ముంబై వీధులు.. T-20 వరల్డ్ కప్ విజేతలకు కనివిని ఎరుగని రీతిలో గ్రాండ్ వెల్‌కమ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు ముంబైలో అపూర్వ సాగ్వతం లభించింది. వరల్డ్ కప్‌తో ముంబైలో అడుగుపెట్టిన భారత ప్లేయర్లకు అభిమానులు కనివినీ ఎరుగని రీతిలో వెల్ కమ్ చెప్పారు. 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫి గెలిచి ఇండియాకు తీసుకురావడంతో టైటిల్‌ను చూసి ఫ్యాన్స్ పులకరించిపోయారు. కాగా, బార్బడోస్ నుండి ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకున్న టీమిండియా ప్లేయర్స్.. ఐటీసీ మౌర్య హోటల్‌లో కాసేపు సేద తీరారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌ను అభినందించిన మోడీ.. ప్లేయర్లకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఢిల్లీ నుండి కప్‌తో బయలుదేరిన టీమిండియా సాయంత్రం ముంబైకి చేరుకుంది. దీంతో ముంబై ఎయిర్ పోర్టులో భారత ప్లేయర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

వరల్డ్ కప్ విశ్వవిజేతలను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. క్రికెట్ అభిమానులతో ముంబై వీధులు కిక్కిరిసిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతా జనంతో ముంబై గల్లీల్లో కోలాహాలం నెలకొంది. ఇక, నారీమన్ పాయింట్ నుండి వాంఖడే స్టేడియం వరకు బీసీసీఐ విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసింది. ఓపెన్ టాప్ బస్సులో వరల్డ్ కప్‌తో పాటు క్రికెటర్లను ఊరేగించనున్నారు. వేలాదిమంది అభిమానుల నడుమ దాదాపు రెండు కిలో మీటర్ల వరకు ఈ ర్యాలీ జరగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ప్లేయర్లనను సన్మానించనుంది. ఈ సందర్భంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌కు ప్రకటించిన రూ.125 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ అందించనుంది.

Advertisement

Next Story

Most Viewed